నీతో రక్త సంబంధం లేదు..బంధువు కాదు. ఇంట్లో వ్యక్తి కాదు...అవసరం వస్తే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. ఏంటో చెప్పు నేనున్నానంటూ భుజంపై చేయి వేస్తాడు. ఎక్కడో పుడతాడు..ఎక్కడో పెరుగుతాడు. అసలు సంబంధమే లేని వ్యక్తి..అయినా జీవితంలో ప్రతి చోట నీతోనే ఉంటాడు. వాడే ఫ్రెండ్.
స్నేహం...ఎక్కడ మెుదలవుతుందో తెలియదు. ఎందుకూ అనే ప్రశ్నే రాదు. కష్టమొస్తే..కన్నీరు తుడుస్తాడు. సంతోషమొస్తే పంచుకుంటాడు. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు..ఇలా అన్ని బంధాలను దేవుడే ఇచ్చినా..స్నేహితుడిని మాత్రం నువ్వే ఎంచుకోమని పంపిస్తాడు. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే...నీ స్నేహితులెవరో చెప్పు..నువ్వేంటో చెప్తా..అనే ఓ మహానుభావుడి మాటలు చాలు..జీవితంలో స్నేహం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.