విజయవాడ భవానీపురానికి చెందిన కళాకారుడు పవన్... ఖాళీ సీసాలు, వ్యర్థాలపై అద్భుతమైన చిత్రీలు గీస్తూ అబ్బురపరుస్తున్నాడు. బొమ్మలు గీయడంపై ఎంతో ఆసక్తి కలిగిన పవన్... లాక్‌డౌన్ కాలంలో ఇంట్లో కూర్చుని వాడిపడేసిన గాజు సీసాలు, మట్టి పాత్రలపై అపురూపమైన చిత్రాలు గీశాడు. దేవుడి బొమ్మలతో పాటు జంతువులు, ప్రకృతి చిత్రాలు గీసి తనలోని కళకు పదును పెట్టాడు. సరదాగా మొదలుపెట్టినా అందరూ మెచ్చుకోలుతో సీసాలపై బొమ్మలు గీసి ఇచ్చి ఉపాధి పొందుతున్నట్లు పవన్ తెలిపారు.
వ్యర్థ సీసాలపై బొమ్మలు.. అబ్బురపరుస్తున్న చిత్రాలు
సహజంగా అబ్బిన చిత్రకళ కరోనా లాక్ డౌన్ కాలంలో అతనికి ఉపాధినిచ్చింది. ఖాళీ సీసాలు, వ్యర్థాలే అతనికి కాన్వాసులయ్యాయి. గాజుసీసాలపై అద్భుతమైన చిత్రాలు గీస్తూ ఆహా అనిపిస్తున్న విజయవాడ కళాకారుడు పవన్...
వ్యర్థ సీసాలపై బొమ్మలు.. అబ్బురపరుస్తున్న చిత్రాలు