జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సూచించారు. నూతన వ్యవసాయ చట్టాలు, పంపుసెట్లకు మీటర్లు బిగింపు వాటి వల్ల రైతుల తీవ్రంగా నష్టపోతారని.. వెంటనే ప్రభుత్వాలు వాటిని రద్దు చేయాలన్నారు.
రుణమాఫీ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ. 8 వేల కోట్ల బకాయిలు, బిందు సేద్యం కింద పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. నివర్ తుపాను బాధితులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.