- 2023 సెప్టెంబర్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే ఎన్నికలకు వెళ్తామన్న సీఎం జగన్
2023 సెప్టెంబర్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు. ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు.
- వైకాపాను ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయన్న చంద్రబాబు
CBN fire on Jagan govt వైకాపా సర్కారు ఎన్ని రోజులు ఉంటుందో వారికే తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వైకాపాను ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు.
- లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్ చేసింది. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం 500 కోట్ల రూపాయలకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్‌గా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
- రేపు దిల్లీలో కీలక సమావేశం, ఏపీ విభజన అంశాలపై చర్చ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు, ఏపీకి పెండింగులో ఉన్న అంశాలపై రేపు మధ్యాహ్నం దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ప్రధాని ఆదేశం మేరకు రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారుల బృందం భేటీ కానుంది.
- ఆప్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎర, భాజపాలో చేరితే రూ.20 కోట్లు, లేదంటే సీబీఐ దాడులు
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. భాజపాలో చేరితే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని తెలిపింది. లేదంటే ఈడీ, సీబీఐ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారని పేర్కొంది. మరోవైపు, లిక్కర్ స్కామ్ విషయంపై మాట్లాడాలని భాజపా ఎదురుదాడికి దిగింది.
- బలపరీక్షలో నెగ్గిన నీతీశ్, విపక్షాల ఐక్యతకు పిలుపు, మోదీపై సెటైర్లు
బిహార్ శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ ప్రభుత్వం నెగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్ రాజీనామా చేయగా డిప్యూటీ స్పీకర్ బలపరీక్ష నిర్వహించారు. ఓటింగ్‌ను బహిష్కరించిన భాజపా సభ నుంచి వాకౌట్ చేసింది. ఇదే సమయంలో కమలం పార్టీ తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించిన నీతీశ్ భాజపా అధిష్ఠానంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
- రాజాసింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఫైర్, మోదీకి స్పెషల్ డిమాండ్
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతిస్తున్నాయంటూ ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
- పెరిగిన బంగారం, వెండి ధరలు, ఏపీ తెలంగాణలో ఎంతంటే
దేశంలో బుధవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- లైగర్ మూవీతో అల్లుఅర్జున్‌కు ఉన్న లింక్ తెలుసా
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ వల్లే 'లైగర్' ప్రాజెక్ట్ మొదలైందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'లైగర్'. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సుకుమార్ .. పూరీని సరదాగా కాసేపు ఇంటర్వ్యూ చేశారు.
- ఆసియాకప్‌లో ఆ స్పెషల్ బ్యాట్‌తో కోహ్లీ, అదరగొట్టేనా
మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్‌లో అతడు ఈ సారి ఓ స్పెషల్ బ్యాట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఓ సారి ఆ బ్యాట్ గురించి తెలుసుకుందాం.
AP TOP NEWS