ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM - ఏపీ ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Aug 7, 2022, 8:58 PM IST

  • ప్రపంచానికే భారత్​ దిక్సూచి.. ముందు వాటిపై దృష్టి పెట్టండి: మోదీ
    నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంటల్లో వైవిధ్యం కనబరచాలని, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2047 లక్ష్యాల గురించి వివరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రైతులను అలా ఆదుకుంటున్నాం.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం జగన్
    దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. పంటలమార్పిడి, నూనె, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యావిధానం అమలు, పాఠశాల, ఉన్నత విద్య, పురపాలక పాలన వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఏపీ పోలీసులు.. వైకాపా పాలనలో దిగజారిపోతున్నారు: చంద్రబాబు
    దేశంలోనే ఒకప్పుడు పేరున్న ఏపీ పోలీసులు.. వైకాపా ప్రభుత్వంలో రోజురోజుకూ దిగజారి పోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ.. కుప్పంలో చేపట్టిన నిరసనల సందర్భంగా దేశాన్ని కాల్చండంటూ..ఒక సీఐ వ్యాఖ్యలు చేయడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రామ్‌ భాయ్‌.. మీ ఛాలెంజ్‌ స్వీకరించా: పవన్‌కల్యాణ్‌
    జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్​ను జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ స్వీకరించారు. చేనేత వస్త్రాలు ధరించిన పవన్​ వాటికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు!
    మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఏడేళ్ల వయసులో బాలిక మాయం.. 9 సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దొరికాడిలా...
    తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్​కు గురైన బాలిక ఆచూకీని గుర్తించారు పోలీసులు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మక్కా క్లాక్​ టవర్​పై పిడుగు.. లక్షలాది వ్యూస్​తో వీడియో వైరల్
    సౌదీ అరేబియా మక్కాలోని ప్రఖ్యాత క్లాక్ టవర్​పై పిడుగు పడిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా బుర్జ్​ అల్​ సా గడియార స్తంభంపై భారీ పిడుగు పడి.. నగరమంతా ఒక్కసారిగా మెరిసిపోయిన వీడియోను ట్విట్టర్​లో ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అద్దెకు ఉండాలా? ఇల్లు కొనాలా? ఏది బెటర్?
    ఏళ్ల తరబడి అద్దె ఇంట్లోనే ఉండాలా? లేక రుణం తీసుకుని ఇల్లు కొనాలా? అనేక మందిని వేధించే ప్రశ్నకు సమాధానమే ఈ కథనం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'అందుకు నేను పదేళ్లు కష్టపడ్డా.. తనకు మాత్రం 'ఊ అంటావా'తో ఫుల్​ క్రేజ్​'
    గిల్లికజ్జాలు, ప్రతిదాంట్లో పోటీ, కీచులాటలు.. అక్కాచెల్లెళ్లున్న ఏ ఇంట్లో అయినా కనిపించేవే! బయటికే ఇవన్నీ! సమస్య వచ్చినపుడు కానీ తెలియదు ఒకరికొకరిపై ఎంత ప్రేముందో. అవసరమైతే అక్క అమ్మవుతుంది. అక్కకేమైనా అయితే చెల్లి శివంగిలా మారుతుంది. అరమరికలంటూ ఎరుగని.. ప్రాణ స్నేహితులకు మించిన బంధమిది. ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించినా.. మేమూ ఇంతే అంటున్నారీ అక్కాచెల్లెళ్లు. సిస్టర్స్‌ డే సందర్భంగా తమ అనుబంధాన్ని పంచుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • CWG 2022: తెలంగాణ అమ్మాయి నిఖత్​ జరీన్​కు గోల్డ్.. నాలుగో ప్లేస్​లో భారత్
    తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. దీంతో భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా.. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details