ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @5PM - ఏపీ ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Aug 7, 2022, 4:58 PM IST

  • ISRO: ఇస్రోకు ఎదురు దెబ్బ.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం!
    ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహాలను తప్పుడు కక్ష్యలో ప్రవేశపెట్టినట్టు ఇస్రో వెల్లడించింది. దీనివల్ల.. ఎస్ఎస్ఎల్వీ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలూ పనిచేయవని ఇస్రో ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర.. మన చేనేత కార్మికులది: సీఎం జగన్
    చేనేత కార్మికదినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్.. నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. నూలు దారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బుపరిచిన చరిత్ర మన చేనేత కార్మికులది అని కొనియాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన రోజా.. ఎందుకంటే?
    మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుపతిలో కలిశారు. నగరిలో మరమగ్గాల కార్మికుల సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన రోజా.. విద్యుత్‌ బిల్లులు తగ్గించాలని కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Drugs: ఆ వెబ్‌సైట్స్ ద్వారా డ్రగ్స్ విక్రయం.. ఐదుగురు అరెస్టు
    స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఇన్​స్ట్రాగామ్ ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసుకోని డార్క్ వెబ్​సైట్స్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నీతి ఆయోగ్‌ భేటీకి నితీశ్‌ గైర్హాజరు.. ఏంటి కథ?
    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశమైంది. దిల్లీలో నిర్వహించిన ఈ భేటీలో జాతీయ నూతన విద్యావిధానం, పంటల మార్పిడి అజెండాలుగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​ గైర్హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • దెయ్యం పట్టిందని కన్నకూతురి హత్య!.. ఆవునూ వదిలిపెట్టని కామాంధుడు!!
    అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ ఆరేళ్ల బాలికకు దెయ్యం పట్టిందనే అనుమానంతో ఆమె తల్లిదండ్రులు దారుణంగా కర్రతో కొట్టారు. దీంతో అక్కడిక్కడే చిన్నారి మరణించింది. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఓ సోషల్​ మీడియా ఆర్టిస్ట్​ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • గాజాపై బాంబుల వర్షం తీవ్రం.. ఇద్దరు పీజేఐ నేతలు హతం.. 28కి చేరిన మృతులు
    ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. శుక్రవారం గాజాపై వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. శనివారమూ భీకరంగా విరుచుకుపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఆకాశ ఎయిర్' సేవలు షురూ.. అహ్మదాబాద్​కు తొలి ఫ్లైట్
    దేశంలో కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆదివారం జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. తొలి విమానం ముంబయి నుంచి అహ్మదాబాద్​ వెళ్లింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నందమూరి హీరోల జోష్.. ఆ సెంటిమెంట్​తో గ్రాండ్​ సక్సెస్​
    జీవితంలో మనం అనుకున్నట్లు అన్నీ జరగవు. కానీ పలు సందర్భాల్లో మాత్రం యాధృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి జరిగినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడు నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం అది చర్చనీయాంశమైంది. అదేంటంటే..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • బాక్సింగ్​, ట్రిపుల్​ జంప్​లో మూడు గోల్డ్​.. ఫైనల్​కు సింధు.. హాకీలో అమ్మాయిలకు కాంస్యం
    కామెన్వెల్త్​ క్రీడల్లో భాగంగా భారత్​ ఖాతాలో మరో ఐదు పతకాలు వచ్చి చేరాయి. బాక్సింగ్​లో నీతూకు, అమిత్​ పంఘల్​కు గోల్డ్​మెడల్​ వరించింది. అమిత్​ పంఘల్​ 48-51కేజీల విభాగంలో ఇంగ్లాండ్​కు చెందిన కియారన్​ 5-0తేడాతో ఓడించి ఈ మెడల్​ను దక్కించుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details