ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు

By

Published : Aug 3, 2022, 9:02 PM IST

  • వడ్డీ లేని రుణాలతో.. చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్​
    వడ్డీ లేని రుణాలతో చిరు వ్యాపారుల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను.. సీఎం జగన్‌ విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అచ్యుతాపురం విషవాయువు లీక్ ఘటన.. ప్రభుత్వ వైఖరిపై తెదేపా ఫైర్ !
    విశాఖ అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. బాధితులను పరామర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. సీడ్స్ దుస్తుల పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువు లీకై.. వందల మంది అస్వస్థతకు గురైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'జగన్ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గర ప‌డింది'
    ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై.. వైకాపా, తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చిన్నమ్మ ఉమామహేశ్వరి మృతితో విషాదంలో ఉంటే ఆస్తి కోసం హత్య చేయించినట్లు.. వైకాపా నేతలు విషప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వక్తం చేశారు. తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌నుకున్న నీచ చరిత్ర జగన్‌ది అని విమర్శించారు. బాబాయి గొడ్డలిపోటుకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Rains in Rayalaseema: రాయలసీమ జిల్లాలను వణికిస్తున్న వానలు
    గోదావరి జిల్లాలను ఇటీవల వరదలు ముంచేస్తే.. ఇప్పుడు రాయలసీమ జిల్లాలను వాన వణికిస్తోంది. చాలాచోట్ల కాలనీలు వాగుల్లా మారాయి. రహదారులపై గుంతలు నిండడం వల్ల రాకపోకలు నిలిచాయి. ఇళ్లలోకి నీటి చేరికతో జనం అల్లాడిపోతున్నారు. ఇక వర్షాల ధాటికి ఈసారీ నష్టాల పాలవుతామని రైతులు వాపోతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'గాంధీ'లకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​.. సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు
    నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ దూకుడు పెంచింది. దిల్లీలోని యంగ్ ఇండియన్​ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఎన్నికల్లో ఉచిత హామీలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. 7 రోజుల్లోగా!
    ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్రమైన ఆర్థిక సమస్యగా అభివర్ణించిన సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. దీనిని పరిశీలించేందుకు ఒక అత్యున్నత కమిటీ ఏర్పాటు దిశగా సూచనలు కోరారు. ఏడు రోజుల్లోగా కేంద్రం, విపక్షాలు, ఇతర సంస్థలు తమ అభిప్రాయాలను అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పెలోసీ పర్యటనతో తైవాన్​ దిగ్బంధనం.. యుద్ధానికి చైనా సై​.. ఏ క్షణమైనా!
    అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌, ఆ దేశ ఉక్కు మహిళ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తైవాన్‌ను జల, వాయు మార్గాల్లో చైనా దిగ్బంధనం చేసిన తీరు చూస్తుంటే తైవాన్‌పై డ్రాగన్‌ యుద్ధానికి దిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • దుమ్మురేపిన రిలయన్స్​.. ఫార్చ్యూన్-500 లిస్ట్​లో ఒకేసారి 51 ర్యాంకులు జంప్
    ప్రఖ్యాత ఫార్చ్యూన్​ మేగజిన్.. 2022కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 టాప్​ కంపెనీల జాబితాను విడుదల చేసింది. 2021లో 155వ స్థానంలో ఉన్న రిలయన్స్.. ఈసారి 104వ ర్యాంకుకు చేరుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మళ్లీ వాయిదా పడిన 'కార్తికేయ 2'.. విడుదల ఎప్పుడో తెలుసా?
    నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ 2'ని మరోసారి వాయిదా వేసింది చిత్ర యూనిట్​. పరిశ్రమలో ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు నటుడు నిఖిల్​. ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'కార్తికేయ 2' టీమ్‌ చెప్పిన విశేషాలు తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌..' ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ఐసీసీకి ఆహ్వానం
    ఇప్పటికే కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కగా.. ఇక ఒలింపిక్స్​లో స్థానమే లక్ష్యంగా మరో ముందడుగు పడింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలని భావిస్తున్నారనే దానిపై ప్రెజెంటేషన్‌ ఇవ్వండని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్​ను (ఐసీసీ) ఆహ్వానించింది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ). పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details