కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు జరగనున్న భారత్ బంద్కు ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ మద్దతిచ్చింది. సమస్యల పరిష్కారం కోసం రేపు భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునివ్వగా.. పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతిచ్చాయి.
రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ఎగుమతులు, దిగుమతులు నిలిపివేయాలని లారీ యజమానులు నిర్ణయించారు. రేపటి బంద్ సందర్భంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిపివేస్తామని లారీ ఓనర్స్ అసోషియేషన్ తెలిపింది. రైతులతో కేంద్రం చర్చించి ఉద్యమాన్ని ఉపసంహరింపజేయాలని అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు డిమాండ్ చేశారు.