AP CORONA CASES:రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,495 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,166 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 9,632 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 32,413 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో ఐదుగురు మరణించినట్లు పేర్కొంది.
Corona cases in India: దేశంలోనూ కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 58,077 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 657మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,407 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.64 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.17 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు:4,25,36,137
- మొత్తం మరణాలు:5,07,177
- యాక్టివ్ కేసులు:6,97,802
- మొత్తం కోలుకున్నవారు:4,13,31,158