ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RGUKT Notification: తాత్కాలిక బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్​ ఉపసంహరణ - ఆర్​జేయూకేటీ తాజా వార్తలు

ఒప్పందం ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకం కోసం(High Court on RGUKT Notification) ఆర్​జేయూకేటీ- నూజివీడు రిజిస్ట్రార్ జారీ చేసిన నోటిఫికేషన్​ను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టుకు.. వర్సిటీ తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న జారీ చేసిన నోటిఫికేషన్​లో లోపాలను హైకోర్టు తప్పుపట్టింది.

ఆర్​జేయూకేటీలో తాత్కాలిక బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్​ ఉపసంహరణ
ఆర్​జేయూకేటీలో తాత్కాలిక బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్​ ఉపసంహరణ

By

Published : Nov 26, 2021, 7:56 AM IST

High Court on RGUKT Notification: ఒప్పందం ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకం కోసం నూజివీడు ఆర్​జేయూకేటీ(RGUKT NEWZVID) రిజిస్ట్రార్.. ఈ ఏడాది అక్టోబర్ 29న జారీ చేసిన నోటిఫికేషన్​లో లోపాలను హైకోర్టు తప్పుపట్టింది. దీంతో ఆర్జీయూకేటీ తరపు న్యాయవాది సంబంధిత నోటిఫికేషన్​ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఆ వివరాలను నమోదు చేసిన న్యాయస్థానం.. విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఒప్పందం ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకం కోసం ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ విడుదల చేసిన నోటిఫికేషన్​పై.. ఒప్పంద పద్ధతిలో బోధన సిబ్బందిగా పనిచేస్తున్న షేక్ నజీర్ హుస్సేన్, మరో ఆరుగురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపు న్యాయవాది డి.డి అనీల్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఒప్పంద ప్రాతిపదికన నియామకం కోసం జారీచేసిన నోటిఫికేషన్లో విధివిధానాలు లేవన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్​కు సంబంధించిన సమాచారం పేర్కొనలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. లోపాలను ఎత్తిచూపుతూ వర్సిటీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆ నోటిఫికేషన్​ను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో నోటిఫికేషన్​ను ఉపసంహరించుకుంటున్నట్లు వర్సిటీ తరపు(RGUKT Notification Cancel) న్యాయవాది వెల్లడించారు.

ఇదీ చదవండి.. :Tank Raised From Gourd: తిరుపతిలో వింత ఘటన.. భూమిలోంచి పైకి వచ్చిన ట్యాంకు

ABOUT THE AUTHOR

...view details