తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావుకి ఏపీ హైకోర్టు ఘన నివాళి అర్పించింది. సోమవారం తెల్లవారుజామున జస్టిస్ కేశవరావు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను స్మరించుకుంటూ.. నివాళి అర్పించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సీజే జస్టిస్ ఏకే గోస్వామి, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్ జస్టిస్ కేశవరావు అందించిన న్యాయసేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొద్ది సేపు మౌనం వహించారు. న్యాయముర్తి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జస్టిస్ పి.కేశవరావు మృతికి ఏపీ హైకోర్టు ఘన నివాళి - high court news
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావుకి ఏపీ హైకోర్టు ఘన నివాళి అర్పించింది. సీజే జస్టిస్ ఏకే గోస్వామి, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్ జస్టిస్ కేశవరావు సేవలను గుర్తు చేసుకున్నారు.
జస్టిస్ పి.కేశవరావు మృతికి ఏపీ హైకోర్టు ఘన నివాళి