ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం (Joint staff council meeting with employees unions) నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం కానుంది.ప్రభుత్వం గుర్తించిన 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్ధిక శాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
Joint Staff Council Meeting : నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం - CS meeting with employees unions
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం (Joint staff council meeting with employees unions)నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం కానుంది.ప్రభుత్వం గుర్తించిన 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్ధిక శాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
ఆర్థిక సమస్యలకు సంబంధించి 11వ పీఆర్సీని (11th PRC) అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏ (DA) బకాయిలు విడుదల చేయాలని, సిపిఎస్ (CPS) రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ,ఉద్యోగులు హెల్త్ కార్డులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి నెల ఒకటో తేదినే పెన్షనర్లకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాయి. నేటి సమావేశంలోనే ఉద్యోగులకు ఎంత బకాయిలు ఉన్నాయో ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే 11 వ పీఆర్సీ నివేదికను కూడా బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలను కూడా వివిధ సంఘాలు ఇచ్చాయి.
ఇదీ చదవండి : AMAZON : అమెజాన్ కూడా భాగస్వామి కావాలి -ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్