- కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కాసేపట్లో కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల విషయమై రాజ్‌భవన్‌లో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- దత్తాత్రేయ సంక్రాంతి శుభాకాంక్షలు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో పర్యటిస్తున్న దత్తాత్రేయను.. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్.. మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపట్లో.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన్ను కలవనున్నారు. అంతకుముందు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దత్తాత్రేయ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- చక్కదిద్దే బాధ్యత యువతదే
తెదేపా అధినేత చంద్రబాబు... యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని సూచించారు. వివేకానందుడు చూపిన బాటలో యువత నడవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసిన ప్రియురాలు
తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడన్న కారణంగా ఓ యువతి.. యువకుడిని హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో కలకలం సృష్టించింది. కత్తితో పొడిచి హత్య చేసిన యువతి.. మృతుడి పక్కనే ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోవడం సంచలనం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- సీఎం అభ్యర్థిపై నిర్ణయం వారిదే: భాజపా
రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిని.. ఆ పార్టీ నాయకులే నిర్ణయించుకుంటారని తమిళనాడు భాజపా ఇంఛార్జ్ సీటీ రవి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అన్నాడీఎంకే..తమ పార్టీ సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పలు మార్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కరోనా తగ్గుముఖం- 13 వేల దిగువకు కేసులు