ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకై కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. షరతులతో కూడిన మద్దతు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాబోయే ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేయాలని.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నారు. సినీ హీరో శివాజీ ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు కాదన్నారు. మిగిలిన సినీ ప్రముఖులు మాదిరిగానే హోదా ఉద్యమానికి శివాజీ కూడా మద్దతు తెలిపారన్నారు. తరువాత పరిస్థితులను బట్టి అయన దూరంగా ఉన్నారన్నారు. హోదా, విభజన హామీలు సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.
'షరతులతో కూడిన మద్దతు మాత్రమే ప్రకటించాలి'
ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ప్రకటించాలని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్
ఇవి చదవండి...గిరిజనుల విద్యను మరింత మెరుగుపరచాలి'