ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి

దేశాలు వేరు, భాషలు వేరు, పెరిగిన వాతావరణం వేరు... కానీ ఆంధ్రా అబ్బాయికి, ఆప్ఘనిస్తాన్ అమ్మాయికి ఇవి ఏవీ అడ్డుగోడలుగా నిలవలేదు. చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇరువురి పెద్దలకూ తెలియజేశారు. వారి అనుమతితో హిందూ సంప్రదాయం ప్రకారం విజయవాడలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

By

Published : Jan 8, 2021, 8:39 AM IST

Published : Jan 8, 2021, 8:39 AM IST

Andhra boy marriage to afghanistan girl in vijayawada
ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి

ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి

ఆంధ్రా అబ్బాయి.. ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో మూడు ముళ్ల బంధంతో, ఏడు అడుగులు నడిచారు. విజయవాడ పటమటలో జరిగిన వివాహ రిసెప్షన్‌లో ఆహ్వానితులు నవ దంపతులను ఆశీర్వదించారు.

రైల్వే డీఎస్పీగా పని‌చేస్తున్న అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరి దంపతుల కుమారుడు వివేకానంద రామన్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నారు. దిల్లీలో చదువుకునే సమయంలో ఆఫ్ఘనిస్తాన్​కు చెందిన ఫ్రూగ్ షిరిన్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని .. ఇంట్లో పెద్దలకు ప్రేమ విషయం చెప్పారు. ఇరుకుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో ప్రేమ జంట ఒక్కటయ్యారు.

ABOUT THE AUTHOR

...view details