అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దాసరి భవన్ లో విద్యార్థి, ఉపాధ్యాయ, యువజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పధకం ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింప చేస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రంగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చు దిదిద్దుతామని చెబుతూ.. మరో పక్క అమ్మఒడి వంటి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపచేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతాయన్నారు.
'అమ్మ ఒడి' ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలి
అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ వర్తింపజేయాలన్న ప్రభుత్వ తీర్పును వ్యతిరేకిస్తూ.. విజయవాడ దాసరి భవన్లో విద్యార్థి, ఉపాధ్యాయ, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
విద్యార్థి,ఉపాధ్యాయ,యువజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం