న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇవాళ తాను విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐ అధికారులకు వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ సమాచారమిచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం.. వేరే కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉందన్నారు. సమయమిస్తే వారం రోజుల్లో విచారణకు హాజరవుతానని సీబీఐని కోరారు. ఆమంచి వినతిని సీబీఐ అధికారులు అంగీకరించారు.
'ఇవాళ విచారణకు హాజరుకాలేను'.. సీబీఐ అధికారులకు ఆమంచి వినతి - సీబీఐ విచారణ తాజా వార్తలు
Amanchi Case: సీబీఐ విచారణకు ఇవాళ తాను హాజరు కాలేనని.. వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులకు సమాచారమిచ్చారు. ఆమంచి వినతిని సీబీఐ అధికారులు అంగీకరించారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావాలంటూ సోమవారం సీఆర్పీసీ సెక్షన్ 41-A కింద ఆమంచికి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
సీబీఐ అధికారులకు ఆమంచి వినతి
సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావాలంటూ సోమవారం సీఆర్పీసీ సెక్షన్ 41-A కింద ఆమంచికి నోటీసులిచ్చారు. ఇదే అంశంలో గతంలోనూ ఆయన విశాఖలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను ఉద్దేశించి.. ఆమంచి కృష్ణమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇవీ చూడండి