ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

alluri seetharamaraju: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అల్లూరి జయంతి

అల్లూరి సీతారామరాజు 124 వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మన్యం వీరుడు అల్లూరి.. తన నిస్వార్థమైన సేవతో ప్రజల గుండెల్లో ఎల్లకాలం నిలిచి ఉంటారని నేతలు కొనియాడారు.

By

Published : Jul 4, 2021, 4:44 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు

విజయనగరం జిల్లాలో...

  • మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తన నిస్వార్థమైన సేవతో ప్రజల గుండెల్లో ఎల్లకాలం నిలిచి ఉంటారని కలెక్టర్ ఎం.హరి జవహర్​లాల్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియం లో అల్లూరి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూల మాలలు వేశారు.
  • అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని పురస్కరించుకొని విజయనగరం మోసానిక్ టెంపుల్ లో ఎస్ఎఫ్ఐ, రోటరీ క్లబ్, ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

విశాఖ జిల్లాలో...

  • భీమునిపట్నం నియోజవర్గం పద్మనాభం మండలం పాండురంగలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
  • అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజానీకం తమ గళం వినిపించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ సీతమ్మధారలోని అల్లూరి విగ్రహం వద్ద 124వ జయంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా సంయుక్తంగా నిర్వహించాయి. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడిన అల్లూరి సీతా రామరాజు పోరాట స్ఫూర్తిని విద్యార్థులు, యువత తమలో నింపుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పాడాల రమణ అన్నారు.
  • మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అనకాపల్లి లో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర రావు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనకాపల్లి పట్టణంలోని గూడ్స్ రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ద నాగ జగదీష్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
  • చోడవరం మండలం గోవాడ గ్రామంలో అల్లూరి సీతరామరాజు జయంతిని నిర్వహించారు. గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో చోడవరం ఎస్సై ఇలియాస్ మహమ్మద్, ఎస్సై వీభూషణరావు పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేశారు. పేదలకు నూతన వస్రాలను పంపిణీ చేశారు.
  • పద్మనాభం మండలం పాండురంగలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్​వాడి, సచివాలయం నూతన భవనాలను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సర్పంచ్ పల్లె ఝాన్సీతో కలిసి ప్రారంభించారు. అల్లూరి 124వ జయంతోత్సవం సందర్భంగా నూతన భవనాలను ప్రారంభించడం ఆనందదాయకమని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. అంగన్వాడీ 2 కేంద్రాలకు ఉమ్మడిగా 20 లక్షల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించామని చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

తణుకులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పాత విగ్రహం స్థానంలోనే ఏర్పాటు చేసిన కొత్త విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విజయవాడలో...

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ స్మరించుకుని, ఆయన అడుగుజాడల్లో ముందుకు పయనించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 27 ఏళ్లకే అల్లూరి తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుడని రాజశేఖర్ కొనియాడారు.

కడప జిల్లాలో...

బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజును మనమందరం స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

Tribute : అల్లూరి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details