Akhanda Movie Team Visit Vijayawada Durga Temple: విజయవాడలో అఖండ చిత్ర బృందం సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ప్రముఖ దర్శకులు, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. దుర్గ గుడిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అఖండ ఘనవిజయం సాధించడం పట్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. అఖండ విడుదలై ఘన విజయం సాధించాక ధైర్యం వచ్చిందన్న బాలకృష్ణ.. దర్శకులు ముందుకొచ్చి కథ నచ్చితే మల్టీస్టారర్ చేస్తానని తెలిపారు.
టికెట్ విధానంపై చిత్రం విడుదలకు ముందు చర్చించాం. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడతాం.- బాలకృష్ణ
అంతకుముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సినీనటుడు బాలకృష్ణ, అఖండ సినిమా బృందానికి బొర్రా గాంధీ, కరుణాకర్ బృందం స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బాలయ్యతో సెల్ఫీలు తీసుకొనేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడినుంచి నేరుగా విజయవాడ దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నీధిలో 'అఖండ' బృందం