నీట్ 2019 ఫలితాల్లో ఆకాష్ విద్యా సంస్థలు ఉత్తమ ఫలితాలు సాధించాయని.. సంస్థ విజయవాడ శాఖ డైరెక్టర్ విజయ్ వెల్లడించారు. అఖిల భారత స్థాయిలో మొదటి 10 ర్యాంకుల్లో 7, మొదటి15 ర్యాంకుల్లో 10 , 100లోపు 30కిపైగా ర్యాంకులు ఆకాష్ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆకాష్ బ్రాంచులతో పాటు విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఆకాష్ విద్యాసంస్థ విద్యార్థులు సైతం ఉత్తమమైన మార్కులు సాధించారన్నారు. 720 మార్కులకు గాను విజయవాడ ఆకాష్ విద్యాసంస్థలో 30కిపైగా విద్యార్థులకు 500లకు పైగా మార్కులు వచ్చాయని వెల్లడించారు. అధ్యాపకులు, విద్యా సంస్థ సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషి వల్లే సంస్థ కు మంచి ఫలితాలు వస్తున్నాయని డైరెక్టర్ విజయ్ అన్నారు.
నీట్ ఫలితాల్లో ఆకాష్ విద్యాసంస్థల సత్తా - akash institutions
నీట్ 2019 ఫలితాల్లో తమ సంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని.. ఆకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్ తెలిపారు.
ఆకాష్