తెదేపా అధినేత చంద్రబాబును మంత్రి బొత్స విమర్శించడాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ఎవరు యువకులో ఎవరు ముసలివాళ్లో తేల్చుకునేందుకు ఓ పోటీ పెడదామని సవాల్ విసిరారు. కేబినెట్లోని ఏ మంత్రి అయినా చంద్రబాబు కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కుతారో వాళ్లే కుర్రోళ్లు అని.. మిగిలిన వారు ముసలివారని వ్యాఖ్యానించారు. పోటీకి బొత్స సిద్ధమేనా? అని ప్రశ్నించారు. పోటీకి సిద్ధం కాకపోతే ముసలి వాడినని ఒప్పుకోవాలని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
బొత్సకు అచ్చెన్నాయుడు సవాల్.. బాబుతో పోటీపడగలరా..! - achhennaidu fires on bosta news
మంత్రి బొత్సపై తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు, ముసలివాళ్లు, ఎవరు కుర్రాళ్లో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.
'ఆయనతో పోటీపడి తిరుపతి కొండక్కితే మీరు కుర్రాళ్లే '