ముఖ్యమంత్రి జగన్ కు.. విజయవాడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు.. సెల్ఫీ వీడియో పంపారు. తన విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలీసు జాగిలాల పనితీరుపై ఫిర్యాదు చేసినందుకు.. తనను ఇబ్బందులకు గురి చేశారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
2005 నుంచి విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్ వరకు డాగ్ హ్యాండ్లర్‌గా పనిచేశారు. శ్రీనివాసరావు ఆరోపణలను ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. సాధారణ బదిలీ మాత్రమే చేశామని వెల్లడించారు.