- విస్తరిస్తున్న మహమ్మారి
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 368 మందికి కొవిడ్ సోకింది. అత్యధికంగా గుంటూరులో 79, అత్యల్పంగా ప్రకాశంలో ఆరుగురికి వైరస్ నిర్ధరణ అయింది. 263 మంది కోలుకోగా.. ఎవరూ మరణించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా లెక్కలతో కలిపి ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,93,734కి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆకలి కేకలు
కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితుల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చుపెడుతోంది. వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ..క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్కో కొవిడ్ బాధితుడి ఆహారం కోసం ప్రభుత్వం రూ. 350 కేటాయించినా..వారికి అందుతున్న భోజనం విలువ కనీసం రూ. 60 కూడా ఖరీదు చేయటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తా'
ఉప ఎన్నికల్లో తనని గెలిపిస్తే తిరుపతి వాణిని పార్లమెంట్లో వినిపిస్తానని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఈనెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఎలా సాధ్యం?'
రాష్ట్రంలో ఇసుక నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం సరైన నిర్ణయం కాదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నిర్ణయంతో సామాన్యుడికి ప్రభుత్వం ఎలా భరోసా కల్పిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మేనిఫెస్టో విడుదల
బంగాల్లో భాజపా మేనిఫెస్టో విడుదల చేశారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తొలి కేబినెట్ సమావేశంలో సీఏఏ అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సంప్రదాయానికి బ్రేక్