ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Student Questions Traffic Police: 'మా నాన్న ఎంపీటీసీ.. నన్నే అడ్డుకుంటారా?' పోలీసులతో బాలుడు వాగ్వాదం - ts news

student questions traffic police: తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్​ పోలీసులకు ఓ విచిత్ర సంఘటన ఎదురైంది. పాత బస్టాండ్​ వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ బాలుడిని పోలీసులు అడ్డుకోగా.. మా నాన్న ఎంపీటీసీ నన్నే అడ్డుకుంటారా..? అంటూ వారిని ప్రశ్నించాడు. ఆ బాలుడి మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు.

8th class student questions traffic police
పోలీసులతో బాలుడు వాగ్వాదం

By

Published : Jan 7, 2022, 10:58 PM IST

పోలీసులతో బాలుడు వాగ్వాదం

student questions traffic police: తెలంగాణలోని సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది. ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కరణ్ అజహర్ అనే బాలుడు స్కూటీపై బ్యాగ్​ వేసుకుని పాఠశాల నుంచి దర్జాగా ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో పాత బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కాడు. బాలుడిని ఆపి నువ్వు ఎక్కడికి వెళ్లొస్తున్నావు అని ట్రాఫిక్ ఆర్​ఎస్సై సాయి ప్రసాద్ ప్రశ్నించగా.. ప్రతిరోజూ పాఠశాలకు ఇదే బండి మీద వెళ్తానని.. ఈ బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదని.. మీరు ఆపకూడదని సమాధానం ఇచ్చాడు.

పైగా మా నాన్న ఎంపీటీసీ నన్నే అడ్డుకుంటారా.. అంటూ పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. విషయం అంతా విన్న ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు తండ్రికి ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు స్కూటీ ఇవ్వొద్దని.. స్కూటీకి లైసెన్స్​ అవసరం లేదని ఏ చట్టంలోనూ లేదని బాలుడు తండ్రికి చెప్పారు. మరోసారి ఇదే ఈ విధంగా జరిగితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. సదరు బాలుడి బంధువులను పిలిపించి బాలుడిని, స్కూటీని అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details