- ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా: సీఎం
'వైఎస్ఆర్ చేయూత' పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద 45ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థికసాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ఈ పథకంతో ఆర్థికసాయం చేయనుంది. ఏడాదికి రూ.18750 చొప్పున 23 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఇప్పటికే జలాశయానికి 57,440 క్యూసెక్కులు నీరు చేరింది. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 122.7178 టీఎంసీలుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా వైద్యంపై ఇప్పుడు మరింత స్పష్టత
వైరస్ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడిందని ఏఐజీఈ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుందంటున్న నాగేశ్వరరెడ్డితో 'ఈనాడు- ఈటీవీ భారత్’ ముఖాముఖి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లో నలుగురు నక్సలైట్లను హతమార్చాయి భద్రత బలగాలు. జగర్గుండా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే''
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మోదీ ఉంటే అన్ని సాధ్యమే'నంటూ భాజపా ఎన్నికల నినాదాన్ని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా ఫొటోను ఆ ఆర్డినెన్స్ ప్రచారానికి వాడుకోకండి'