తిరుపతి రైల్వేస్టేషన్(tirupathi railway station)లో కోచ్ సూపర్ వైజర్‌గా గుణశేఖర్ నాయుడు విధులు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. విధులు కేటాయించాలంటే హోటల్ రూమ్‌కు రావాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహిళా సంఘాలు, ఐద్వా నాయకులతో కలిసి బాధితురాలు తిరుచానూరులో ఉన్న గుణశేఖర్ వద్దకు వెళ్లింది. వాళ్లందరూ చూస్తుండగానే.. ఆ అధికారికి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SEXUAL HARASSMENT: మహిళా ఉద్యోగితో అసభ్య ప్రవర్తన.. అధికారికి దేహశుద్ధి - thirupathi latest news
విధులు కేటాయించేందుకు ఓ అధికారి.. తనను లైంగికంగా వేధిస్తున్నారని(sexual harassment) ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల నేతలతో కలిసి, హోటల్ గదిలో ఉన్న ఆ అధికారికి దేహశుద్ధి(beating) చేశారు. ఈ ఘటన తిరుపతి(tirupathi)లో జరిగింది.
మహిళా ఉద్యోగితో అసభ్య ప్రవర్తన... అధికారికి దేహశుద్ధి
గత కొన్ని రోజులుగా రైల్వే కోచ్‌లో పని చేస్తున్న మహిళలను గుణశేఖర్ లైంగిక వేధిస్తున్నాడని మహిళా సంఘాల నేతలు(women union leaders) ఆరోపించారు. తనతో అనుకూలంగా ఉండే వారికి ఓ రకంగా, వ్యతిరేకత కలిగిన వారికి మరో రకంగా విధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ ఇంటికి వెళ్లి అసభ్యకరంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుణశేఖర్‌పై చట్టపరమైన చర్యలు(legal acts) తీసుకోవాలని డిమాండ్(demand) చేశారు.
ఇదీచదవండి.