ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం - tirumala latest news

ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు జనవరి 1న... స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వీఐపీల సిఫారసు లేఖలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల్లో కరోనా నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.

Visit through Vaikuntha only for those who have tickets
టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

By

Published : Dec 18, 2020, 4:23 AM IST

టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌ ద్వారా 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీచేశామని తెలిపారు. ఈ నెల 24 నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీచేస్తామన్నారు. తిరుపతిలో జారీచేసే సర్వదర్శనం టోకెన్లు స్థానికులకు మాత్రమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని.... వారి సిఫారసులు అనుమతించబోమన్నారు..

వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న పది రోజుల పాటు.... దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమలకు అనుమతిస్తామని తితిదే స్పష్టం చేసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలినడక ప్రాంతాలతో పాటు అలిపిరి రహదారి మార్గ ప్రవేశ ప్రాంతాల్లో టికెట్లు తనిఖీ చేసి... తిరుమలకు అనుమతిస్తామని తెలిపింది. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే భక్తులతో పాటు విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొనే భక్తులు పది రోజుల పాటు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కల్యాణోత్సవం టికెట్లు తీసుకొన్న భక్తులను ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు జనవరి 1న దర్శనానికి అనుమతించమన్నారు.

వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణరథం లాగేందుకు భక్తులను అనుమతించడం లేదని తితిదే స్పష్టం చేసింది. ద్వాదశి రోజున చక్రస్నానం ఏకాంతంగా జ‌రుగుతుందని తెలిపింది.

ఇదీ చదవండీ... అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details