తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్ రామ్ శంకర్ ఖథేరియా, ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి విజయానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. కర్ణాటక అదనపు సీఎస్ ఐఎన్ఎస్ ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తెదేపా నేత శ్రీనివాసులురెడ్డి తదితరులు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు... ప్రముఖులకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందచేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - tirumala latest news
తిరుమల శ్రీవారి సేవలో ఆదివారం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు