తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని (Hanuman birth place) వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. తితిదే (TTD) శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై శుక్రవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది. కార్యక్రమంలో భారతీ మహాస్వామి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు.
అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని (Hanuman birth place) పేర్కొన్నట్లు భారతీ మహాస్వామి వివరించారు. అంతకుముందు తితిదే ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని (Hanuman birth place) పండిత పరిషత్ నిర్ధారణ చేసిందన్నారు. పండితులు ఆధారాలతో సహా ప్రకటించాక పుస్తకాన్ని విడుదల చేశామని ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించామన్నారు.
అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో చర్చ పెట్టామన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం మహీంద్రా వర్సిటీ న్యాయ కళాశాల డీన్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. 2007లో అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముద్రించిన హనుమాన్స్ కేం పుస్తకంలో కూడా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని (Hanuman birth place) రాశారని పేర్కొన్నారు. తితిదే కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయాన్ని రాశారని తెలిపారు.