ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala: దాతలకే ఉదయాస్తమాన సేవా టికెట్లు: ధర్మారెడ్డి - ttd ceo on ttd tickets

TTD Tickets: సేవా టికెట్లను శుక్రవారం రూ. కోటిన్నరకు, మిగిలిన రోజుల్లో కోటికి విక్రయిస్తునట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో తిరుపతిలో తితిదే నిర్మించనున్న చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించే భక్తులకు ఈ సేవా టికెట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

ttd tickets
ttd tickets

By

Published : Dec 25, 2021, 6:44 AM IST

Tirumala Seva Tickets: తిరుమల శ్రీవారి సేవలను వ్యాపారాత్మకం చేశారని, ఉదయాస్తమాన (సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని సేవల్లో పాల్గొనవచ్చు) సేవా టికెట్లను శుక్రవారం రూ.కోటిన్నరకు, మిగిలిన రోజుల్లో రూ.కోటికి విక్రయిస్తున్నారనే విమర్శల్లో వాస్తవం లేదని తితిదే అదనపు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో తిరుపతిలో తితిదే నిర్మించనున్న చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించే భక్తులకు ఈ సేవా టికెట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

  • ఉదయాస్తమాన సేవ 1982లో ప్రారంభమైంది. సేవా టికెట్లను మొదటి విధానంలో వ్యక్తి పేరు మీద, రెండో విధానంలో సంస్థ పేరు మీద కేటాయిస్తున్నాం. వ్యక్తులకు జీవిత కాలం, సంస్థల పేరుమీద కేటాయించిన వాటిలో 20 ఏళ్ల పాటు సేవలో పాల్గొనే నిబంధనలు రూపొందించారు. టికెట్‌ కొన్న వారితో పాటు మరో ఐదుగురు ఏడాదికోసారి ఈ సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 2,961 టికెట్లు ఉన్నాయి. వీటిలో 2,430 మంది ఇప్పటికే స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. టికెట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు చనిపోవడం, సంస్థల పేరిట కొనుగోలు చేసిన వారి గడువు తీరిపోవడం వంటి వాటితో 531 ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో శుక్రవారం 28; శని, ఆది, సోమవారాలకు 38; మంగళ, బుధ, గురువారాల్లో 465 టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

పలు మార్పులతో అమలు

ఈ సేవా టికెట్ల సంఖ్య, ధరలు పెరగడంతో పాటు కేటాయింపు విధానాల్లో 2002, 2006 సంవత్సరాల నుంచి కొన్ని మార్పులు జరిగాయి. 1982లో ప్రారంభమైనప్పుడు సేవా టికెట్ల ధర శుక్రవారం రూ.3 లక్షలు, మిగిలిన రోజుల్లో రూ.లక్ష ఉండేది. 2002 నుంచి శుక్రవారం రూ.5 లక్షలు; మిగిలిన రోజుల్లో రూ.2 లక్షలకు పెరిగింది. 2006లో శని, ఆది, సోమవారాల్లో మరో 409 టికెట్లను కేటాయించి.. వాటి ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దీంతోపాటు వ్యక్తిగతంగా కొనుగోలు చేసేవారు సేవలో పాల్గొనే సమయాన్ని జీవిత కాలం నుంచి 25 ఏళ్లకు తగ్గించాం. తిరుపతిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి విరాళాలిచ్చే దాతలకు గౌరవంగా ఉదయాస్తమాన సేవ కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

సాధుసంపత్తులు, పీఠాధిపతుల విమర్శలపై..

తితిదేలో విరాళాల వ్యవస్థ ఎప్పటినుంచో ఉంది. మఠాలు, పీఠాలు ధార్మిక సంస్థలు విరాళాల ఆధారంగానే నడుస్తాయి. హుండీ ఆదాయం, దాతల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న తితిదే.. పేద పిల్లల వైద్యం కోసం ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సమీకరిస్తూ దాతలకు గౌరవప్రదంగా ఉదయాస్తమాన సేవ కేటాయిస్తోంది. దీనిపై విమర్శలు చేస్తున్న గోవిందానంద సరస్వతి విరాళాలు లేకుండా తన పీఠాన్ని ఎలా నడుపుతున్నారో సమాధానం చెప్పాలి.

ఇదీ చదవండి:

సినిమా చూపించలేను మావా..! ఆందోళనలో ఏపీ ఎగ్జిబిటర్లు.. అసలేం జరుగుతోంది..?

ABOUT THE AUTHOR

...view details