ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ ప్ర‌క్రియ త్వరగా పూర్తి చేయాలి: ఈవో జ‌వ‌హర్‌ రెడ్డి - తిరుమల తాజావార్తలు

తితిదే ఈవో జ‌వ‌హర్‌ రెడ్డి .. సీనియ‌ర్ అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు వ్యాక్సినేషన్​ ప్రక్రియపై ఆరా తీశారు. బ‌ర్డ్, ఆయుర్వేద ఆస్పత్రుల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ttd eo
తితిదే ఈవో జవహార్​ రెడ్డి

By

Published : May 22, 2021, 8:36 PM IST

తితిదేే ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ ప్ర‌క్రియ వేగంగా పూర్తి చేయాలని ఈవో జ‌వ‌హర్‌ రెడ్డి ఆదేశించారు. సీనియ‌ర్ అధికారుల‌తో నిర్వహించిన వ‌ర్చువ‌ల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. బ‌ర్డ్, ఆయుర్వేద ఆసుప‌త్రుల‌్లో బెడ్లు, ఆక్సిజ‌న్‌ నిల్వలు, రోగుల‌కు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ఉద్యోగులకు టీకా వేశారు.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ పూర్తి వంటి విషయాలపై ఆరా తీశారు. ఐసోలేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వ‌హించే పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్‌ వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించిన స్విమ్స్‌లో నమోదైన కేసుల నివేదిక పంప‌వ‌ల‌సిందిగా స్విమ్స్ సంచాల‌కుడిని కోరారు. బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్ల‌ల హాస్పిటల్​ ప‌నుల‌ను త్వ‌రగా పూర్తి చేయాల‌న్నారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో నిర్మిస్తున్న పైక‌ప్పు ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌కు ఆదేశించారు. తిరుమ‌ల‌లో కాటేజీల ఆధునికీక‌ర‌ణ ప‌నులు వీలైనంత త్వరగా ముగించాలన్నారు. పలు ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు.

ఇదీ చదవండి:తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details