తిరుమల అన్నమయ్య భవనంలో నేడు తితిదే ధర్మకర్తల మండలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది. ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షత వహించే ఈ భేటీకి 93 అంశాలతో భారీ అజెండాను సిద్ధం చేశారు. లాక్‌డౌన్‌తో భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినందున ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడం, భక్తుల దర్శనం ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నిరర్థక ఆస్తుల విక్రయంపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంస్థలో సిబ్బంది నియామకంతో పాటు తిరుపతి, తిరుమల, వివిధ రాష్ట్రాల్లోని తితిదే అనుబంధ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై చర్చలు జరిపే అవకాశం ఉంది.
అన్నమయ్య భవనంలో నేడు తితిదే మండలి సమావేశం - తిరుమల నేటి వార్తలు
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం నేడు తిరుమలలో జరగనుంది. ఈ భేటీలో ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడం, దర్శనాలపై తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.
నేడు అన్నమయ్య భవనంలో తితిదే మండలి సమావేశం