ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: తిరుమల ఘాట్‌రోడ్‌లో పునరుద్ధరణ పనులు.. భక్తులకు అనుమతి - Restoration work on the Srivari pathway

భారీ వర్షాలతో తిరుమల కనుమ దారులు మూసివేసిన అధికారులు.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతుండడంతో భక్తులను అనుమతిస్తున్నారు. అయితే అలిపిరి మెట్ల మార్గంలో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతున్నందున(heavy rains in Tirumala).. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం మూసివేశారు. ఘాట్‌రోడ్‌లో భక్తులను అనుమతిస్తున్నారు.

ttd allowed devotees
తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులను అనుమతిస్తున్న తితిదే

By

Published : Nov 20, 2021, 8:13 AM IST

Updated : Nov 20, 2021, 12:01 PM IST

ధ్వంసమైన శ్రీవారి నడక మార్గం పునరుద్ధరణ చర్యలు

వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆగిన తిరుమల(ttd) ప్రయాణాన్ని తితిదే తిరిగి ప్రారంభించింది. తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులను(ttd allowed devotees on ghat road) అనుమతిస్తోంది. అయితే.. అలిపిరి మెట్ల మార్గంలో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతున్నందున(heavy rains in Tirumala).. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం మూసివేశారు.

నడక మార్గం పునరుద్ధరణ చర్యలు..

ఏకధాటిగా కురిసిన వర్షాలకు తిరుమల వెళ్లే శ్రీవారి నడక మార్గం పూర్తిగా (srivari footpath route) ధ్వంసమైంది. కొండ పైనుంచి వచ్చిన వరద, పెద్దపెద్ద బండరాళ్లు, బురదతో మార్గమంతా నిండిపోయింది. ఎంతో నాణ్యతతో, పటిష్టంగా ఉండే నడక మార్గం నిర్మాణం ఈ స్థాయిలో ధ్వంసమైందంటేనే... వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్గాన్ని మళ్లీ పునరుద్ధరించాలంటే ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తిరుమల శ్రీవారి మెట్ల (ttd) మార్గం కొండపై నుంచి వచ్చిన వరదతో (srivari footpath damage) మెట్ల ప్రాంతానికి చేరుకునే రహదారి దెబ్బతినింది. పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

50 ఏళ్లలో ఇంతటి వర్షాలు చూడలేదు..

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల వరద విలయంలో(heavy rains in Tirumala) చిక్కుకుంది. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలు భక్తులకు భీతవాహ పరిస్థితిలా తలపించింది. నలువైపులనుంచి వచ్చిన వరద తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో(floods at tirumala) ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd).. శుక్ర, శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో క‌పిలేశ్వరాల‌యం వద్ద జలపాతం జోరుమీదుంది.పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే మూసివేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది.

కనుమదారుల్లో పెద్దఎత్తున కొండల పైనుంచి వరద నీరు జలపాతాలుగా పడుతుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు కూలాయి. కనుమదారిలో చాలాచోట్ల వరద నీరు నిలిచిపోయి...రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.

ఇదీ చదవండి..

tirumala rains: వరద విలయంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం

Last Updated : Nov 20, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details