ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOPNEWS : ప్రధాన వార్తలు @ 5PM - TOP NEWS @ 5PM

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Nov 15, 2021, 5:00 PM IST

  • Lathi charge : విజయవాణి కళాశాల వద్ద ఉద్రిక్తత...తెదేపా నేతలపై లాఠీఛార్జ్

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో(kuppam municipality elections) ఉద్రిక్తత నెలకొంది. దొంగఓట్లు వేసేందుకు స్థానికేతరులు వచ్చారని తెదేపా నేతలు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్(police lottie charge on TDP leaders) చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు

ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా చేయాలా అని.. వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దారుణ పనులు చేస్తే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Municipal Elections: దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు నిద్రపోతున్నారా ?: సజ్జల

దొంగ ఓట్లు (Fake votes) వేయించుకునే అలవాటు వైకాపాకు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala Ramakrishna reddy) అన్నారు. కుప్పంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోందని.., అయినా దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు (TDP polling agents) నిద్రపోతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • KRMB: నాగార్జున సాగర్​లో పర్యటించిన కేఆర్​ఎంబీ సబ్​ కమిటీ

నాగార్జున సాగర్​లో కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ(krmb sub committee visit nagarjuna sagar project) పర్యటించింది. ఈ సందర్భంగా కమిటీని కలిసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య.. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించే అక్రమ పాజెక్టులు ఆపాలని విన్నవించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ దేశానికి అంకితం'

భోపాల్​లో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన​ రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Live Video: రూ.2500 కోసం ఫ్రెండ్​ను కత్తితో పొడిచి..

రూ. 2500 కోసం తోటి స్నేహితుడిని కిరాతకంగా పొడిచి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కష్టాల్లో ట్రంప్.. గట్టెక్కేందుకు​ హోటళ్ల అమ్మకం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ను(Trump international hotel) విక్రయించనున్నారు. భవిష్యత్తులో ఈ హోటల్‌ పేరు వాలడ్రోఫ్‌ ఆస్టోరిగా మారనుంది. దీనిని హిల్టన్‌ గ్రూప్‌ నిర్వహించనుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి(stock market live). సెన్సెక్స్​ (bse sensex today) 32 పాయింట్లు బలపడి 60,719 వద్దకు చేరుకుంది. నిఫ్టీ (nse nifty 50 index ) 7 పాయింట్లు వృద్ధి చెందింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఐసీసీ జట్టులో టీమ్​ఇండియా క్రికెటర్లకు దక్కని చోటు

ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిచిన టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) ఆదివారంతో పూర్తయింది. ఎందరో క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వారిలో మెరికల్లాంటి ప్లేయర్లతో 'టీమ్​ ఆఫ్​ ది టోర్నమెంట్​'ను ప్రకటించింది ఐసీసీ. ఇందులో టీమ్​ఇండియా (Team India News) నుంచి ఒక్క క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయం మన అభిమానుల్ని నిరాశపరుస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • హీరోయిన్ 'ఫస్ట్​నైట్' కామెంట్స్.. బ్యాన్​ చేయాలని డిమాండ్

ప్రముఖ కథానాయిక రచితారామ్​.. ఇటీవల 'ఫస్ట్​నైట్'పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఆమెను బ్యాన్ చేయాలని కన్నడ క్రాంతి దళ్ డిమాండ్ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details