శ్రీవారి దర్శనార్థం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డిలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
Piyush Goyal: నేడు శ్రీవారిని దర్శించుకోనున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ - తిరుమల వార్తలు
తిరుమల శ్రీవారిని ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఆయన శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి బుగ్గన, ఎంపీ గురుమూర్తి స్వాగతం పలికారు.
తిరుమలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్