శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు మార్చి నెల టికెట్ల కోటాను ఈనెల 22న ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
సర్వ దర్శనానికి 4 రోజుల నిరీక్షణ
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కౌంటర్లలో ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నారు. శుక్రవారం నాటికి ఈనెల 22కు సంబంధించిన స్లాట్ నడుస్తోంది. టికెట్లు కొనుగోలుచేసే భక్తులు నాలుగురోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందని తితిదే తెలిపింది.
ఇదీ చదవండి:
న్యాయవాద దంపతుల హత్య కేసులో రోజుకో మలుపు... పుట్టలో ఇంకెందరో