కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ నెల 8 నుంచి తిరుమల ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని క్యూలైన్లను ఎస్పీ రమేశ్‌రెడ్డి పరిశీలించారు. కోరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. భౌతికదూరం పాటించే విధంగా క్యూ లైన్లలో ఏర్పాట్లు చేశారు. దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యల గురించి అధికారులతో చర్చిస్తామని తెలిపారు.
తిరుమలను సందర్శించిన ఎస్పీ రమేష్‌రెడ్డి - తిరుమల దేవస్థానం
తిరుమలలో కరోనా నివారణ చర్యలను స్థానిక ఎస్పీ రమేష్‌రెడ్డి పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భౌతిక దూరం పాటించే విధంగా చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమలను సందర్శించిన తిరుపతి ఎస్పీ