తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో పరిపాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దారు సురేష్‌బాబు గురువారం గుండెపోటుతో మరణించారు. కొద్ది రోజులుగా సెలవుపై ఉన్న ఆయన.. కలెక్టర్ హరినారాయణన్‌ను కలిసేందుకు జిల్లా సచివాలయానికి వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ ప్రాంగణంలో నిలుచున్న ఆయన ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే కలెక్టరేట్‌లోని 104 కాల్‌సెంటర్ సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే కలెక్టరేట్ నుంచి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. సురేష్‌బాబు మార్గమధ్యలోనే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
AO Sureshbabu: గుండెపోటుతో ఏవో సురేష్‌బాబు మృతి
తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో పాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దారు సురేష్‌బాబు గురువారం గుండెపోటుతో చనిపోయారు. కలెక్టర్ హరినారాయణన్‌ను కలిసేందుకు జిల్లా సచివాలయానికి వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ ప్రాంగణంలో నిలుచున్న ఆయన ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు.
సురేష్‌బాబు
కలెక్టర్ హరినారాయణన్ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. జేసీ రాజశేఖర్, డీఆర్‌వో మురళి తదితరులు ఉన్నారు. సురేష్‌బాబు స్వస్థలం చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ. అంత్యక్రియలు చిత్తూరులోనే నిర్వహించనున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:గూడూరులో బైకులో దూరిన పాము.. తిరుమల మెట్ల బాటలో భయపెట్టిన కొండచిలువ