ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirupathi Still in flood water : వరద నీటిలో తిరుపతి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం - తిరుపతికి రైళ్ల రాకపోకల సమయాలు

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు (Heavy Rains in Tirupathi) నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

Tirupathi Still in flood water
వరద నీటిలో తిరుపతి-పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

By

Published : Nov 21, 2021, 9:56 AM IST

Updated : Nov 21, 2021, 12:16 PM IST

వరద నీటిలో తిరుపతి

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు (Due to heavy rains in Tirupathi Interruption in train services) అంతరాయం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలతో తిరుపతి నగరంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువుల నుంచి వరద నీరు నగరంలోకి వస్తోంది. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇంకా తొలగలేదు.

ఇంకా జలదిగ్బంధంలోనే...

గాయత్రినగర్‌, సరస్వతి నగర్‌, శ్రీకృష్ణనగర్‌ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముత్యాలరెడ్డిపల్లి, ఉల్లిపట్టెడ, దుర్గానగర్‌ ప్రాంతాలు నీటలోనే తేలుతున్నాయి.ఆటోనగర్‌ లోని వెయ్యి కుటుంబాలు గత నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యాయి. పునరావాస కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాధితుల చేరుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం (Padmavathi university in flood water)ఉంది.

కాస్త తగ్గుముఖం...పునరుద్ధరణ..

తూర్పు పోలీస్‌స్టేషన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద వరద నీరు కాస్త తగ్గుముఖం పట్టింది. నగరంలోని వెస్ట్‌ చర్చి అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద వరద నీరు తగ్గింది. దీంతో రాకపోకలను తిరుపతి నగరపాలక సంస్థ పునరుద్ధరించింది.

పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం-రద్దు ...

తిరుపతి - ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ను రైల్వే అధికారుల రద్దు చేశారు. నెల్లూరు-పడుగుపాడు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా చీరాలలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. జిల్లాలోని వేటపాలెంలో పూరీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప-తిరుపతి మార్గంలో ఆర్టీసీ అధికారులు రాకపోకలు నిలిపివేశారు.

రవాణా పునరుద్ధరణ...

తిరుమలకు రెండు ఘాట్‌ రోడ్‌ల ద్వారా ద్విచక్రవాహనాలు మినహా భక్తుల అనుమతినిచ్చింది. తిరుపతి విమానాశ్రయానికి (Tirupathi Airport)విమానాల ద్వారా రాకపోకల పునరుద్ధరించారు.కడప-తిరుపతి మార్గంలో మినహా.. అన్ని మార్గాల నుంచి రాకపోకలను ఆర్టీసీ పునరుద్ధరించింది.

ఇవీ చదవండి :

Last Updated : Nov 21, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details