ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68వేల 466 టికెట్లు విడుదలయ్యాయి.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68వేల 466 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 6వేల 516 సేవా టికెట్లు, సుప్రభాతం 3వేల 856, తోమాల 60, అర్చన 60 సేవా టికెట్లు, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2వేల 300, కరెంటు బుకింగ్ కింద 61 వేల 950 ఆర్జిత సేవా టికెట్లు, విశేషపూజ 2వేల 500, కల్యాణోత్సవం 13వేల 775 సేవా టికెట్లు, ఊంజల్‌సేవ 4వేల 350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7వేల 975 టికెట్లు, వసంతోత్సవం 15వేల 950, సహస్రదీపాలంకరణ 17వేల 400 టికెట్లను తితిదే అందుబాటులో ఉంచింది.
ఇవీ చూడండి-గురుకులాల విద్యార్థినులు... జపాన్ భాషలో సత్తా చాటుతున్నారు