చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని తిరుచానూరులో బాలిక అపహరణ ఘటన కలకలం రేపింది. తన కుమార్తెను బంధువులే ఎత్తుకెళ్లారంటూ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
KIDNAP: తిరుచానూరులో బాలిక అపహరణ.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి - chittoor district news
చిత్తూరు జిల్లాలోని తిరుచానూరులో బాలిక అపహరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురికి బలవంతంగా పెళ్లి చేసేందుకు సమీప బంధువులే అపహరించారంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది.
తిరుచానూరులో బాలిక అపహరణ
ఈ నెల 6న తన కుమార్తె అపహరణకు గురైనట్లు తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన సోదరుడు కుమారుడితో తన కూతురికి బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు తిరుచానూరు పోలీసులు తెలిపారు.