తన భర్త జయంతి సందర్భంగా సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఆధ్వర్యంలో తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పత్రాన్ని పోలీసులు సుగుణమ్మకు అందజేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని.. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన జరగనున్న నేపథ్యంలో పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని విమానశ్రయంలో అడ్డుకోవడం సరికాదన్నారు.
'నివాళి అర్పించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణం' - వైకాపాపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఫైర్
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని.. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. తన భర్త జయంతి సందర్భంగా సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నివాళి అర్పించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణం'
తమ అధినేత చంద్రబాబు ఇంటిగేటును తాళ్లతో కట్టినరోజే జగన్ రెడ్డి పిరికితనం బయటపడిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వశ్రీనివాసులు విమర్శించారు. జగన్‌రెడ్డి తుగ్లక్ చర్యలపై ప్రజలు తిరగబడతారనే భయంతోనే చంద్రబాబును తిరుపతి విమానాశ్రయంలో నిర్భందించారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు