వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితంగా జారీ చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో తెలిపారు. కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులకు సౌకర్య కల్పనకు ఫిలిగ్రిమ్ వేల్పేర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో 21.96 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని... 95 లక్షల లడ్డూలు విక్రయం జరిగినట్టు వివరించారు. హుండీ ద్వారా రూ.84.27 కోట్లు ఆదాయం లభించినట్టు తెలిపారు.
ఆన్‌లైన్‌లో శ్రీనివాసుడి ఆగస్టు నెల దర్శనం టికెట్లు
ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. 67వేల 737 టికెట్లను ఆన్‌లైన్ ఉంచింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 11వేల 412 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 8117సుప్రభాతం, 120 తోమాల, 120 అర్చన, 180అష్టాదళ పాదపద్మారాధన, 2 వేల 875 నిజపాద దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కరెంటు బుకింగ్ కింద 56వేల 325 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసింది. విశేషపూజ 1500, కల్యాణోత్సవం 13వేల300 సేవా టికెట్లు కొనుక్కోవచ్చు. ఊంజల్‌సేవ 4వేల 200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7వేల 425 టికెట్లు నెట్‌లో పెట్టారు.
వసంతోత్సవం 14వేల 300, సహస్రదీపాలంకరణ 15వేల 600 టికెట్లను బుక్ చేసుకోవచ్చు.