ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2020, 12:33 AM IST

ETV Bharat / city

యాప్‌లు వస్తుంటాయి... పోతుంటాయి.. ప్రతిభ మాత్రం లోకల్‌

సాధించాలన్న తపన.. పట్టువిడవని సంకల్పమున్న ప్రతిభావంతులు యువతరంలో కోకొల్లలు. సామాజిక మాధ్యమాల వినియోగం శరవేగంగా పెరిగిన తర్వాత యాప్‌లు... అంతర్లీనంగా ఉన్న ప్రతిభాపాటవాలకు చక్కని వేదికగా మారాయి. ఈ నేపథ్యంలో... టిక్‌ టాక్‌ వంటి చైనీస్‌ యాప్‌ల నిషేధం తరవాత... వీటి ద్వారానే వెలుగులోకి వచ్చిన టిక్‌ టాక్‌ స్టార్ల పరిస్థితి ఏంటి..? తిరిగి తమ అభిమానులకు చేరువయ్యేలా వీరు చేస్తున్న ప్రయత్నాలేంటి....? సరికొత్త... స్వదేశీ యాప్‌లతో ఏలా రాణిస్తారనేది... సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

tik-tok-stars in tirupathi
యాప్‌లు వస్తుంటాయి... పోతుంటాయి.. ప్రతిభ మాత్రం లోకల్‌

టిక్ టాక్............ భారత్ లో విశేష ప్రజాదరణ పొందిన ఓ చైనీస్ ఎంటర్​టైన్​మెంట్​ అప్లికేషన్. మన దేశంలో ఎంతో మంది యువతీయువకులు తమ ప్రతిభా ప్రదర్శనకు వేదికగా మలుచుకున్నారు. తమ వీడియోలతో అందరినీ మెప్పిస్తూ... లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇప్పుడు.. టిక్‌ టాక్‌ను నిషేధించడంతో... ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయారు. అయినప్పటికీ.. ప్రతిభకు టిక్‌ టాక్‌ ఒక్కటే వేదిక కాదంటున్నారు... తిరుపతి యువ టిక్‌ టాకర్లు


తిరుపతిలో వర్థమాన ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. శేషాచల అటవీ అందాలను, తిరుమలలోని సుందర దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తుంటాడు. "బ్యూటిఫుల్ తిరుపతి" పేరుతో శశి తీసిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యేవి. టిక్ టాకర్ గా మిలియన్ల ఫాలోవర్లు గల శశి...ఈ యాప్ ను ప్రభుత్వం బ్యాన్ చేసినా....తనలో ప్రతిభకు వచ్చే లోటేం లేదంటున్నాడు ఫోటో గ్రాఫర్ శశిధర్.

పెన్సిల్ నే కాన్వాస్ గా...

పెన్సిల్‌ నే తన కాన్వాస్ గా మార్చుకుని కళాఖండాలను సూక్ష్మరూపంలో తీర్చిదిద్దుతున్న ఈ యువకుడి పేరు మౌళేష్. తన ప్రతిభ పదిమందికీ తెలిసేలా....టిక్ టాక్ లో వీడియోలు గా రూపొందించి... వేల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించాడు. టిక్ టాక్ బ్యాన్ చేసినా......అందుబాటులో ఉన్న వేరే యాప్ ల ద్వారా తన వీడియోలను తిరిగి పోస్ట్ చేస్తున్నాడు. ఫాలోవర్లు ఒక్కసారిగా సున్నా అయిపోయారన్న చిన్న బాధ తప్ప.....తన లక్ష్య సాధనలో వెనుకడగు వేసేది లేదంటున్నాడు.

వివపడకపోయిన...మాట్లాడలేకపోయిన.. అలవోకగా డైలాగ్

పుట్టుకతోనే అవయవలోపంతో జన్మించిన ఈ కుర్రాడు....తనకు వినపడకపోయినా, మాట్లాడలేకపోయినా మిత్రుల సాయంతో టిక్ టాకర్ గా రాణించేవాడు. ఉత్సాహ భరితమైన డైలాగ్ లను అలవోకగా చెప్పేస్తాడు. జీవన్ కుమార్ పేరుతో టిక్ టాక్ ఖాతా ద్వారా మనోడు సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది... టిక్ టాక్‌ను నిషేధించినా.... ఏ మాత్రం అధైర్యపడకుండా తిరిగి ప్రయత్నిస్తానంటూ తోటి వారికి స్ఫూరిగా నిలుస్తున్నాడు జీవన్ కుమార్

సమాజానికి సందేశమిస్తూ..

సమాజానికి సందేశమిచ్చే అంశాలతో టిక్ టాక్ వీడియోలు మలిచేవాడు...శశి సన్నీ. ఆడపిల్లలను కాపాడుకోవాలని, జవాన్లను గౌరవించాలంటూ అతడు చేసే చిన్న చిన్న వీడియోలు వైరల్ అయ్యేవి. నటిగా తమలోని టాలెంట్ చూపించాలనే తపనతో......భవ్య, శ్రావ్య లాంటి యువతులు చేసిన వీడియోలు ఫాలోవర్లను బాగా అలరించేవి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కొంత మేర బాధించినా....బ్యాన్ చేసింది టిక్ టాక్ నే కానీ...తమలోని ప్రతిభను కాదంటూ వారు ధీమాగా చెబుతున్నారు..

సాధారణంగా ఒక టిక్‌ టాక్‌ వీడియో చేయాలనే ఆసక్తితో యువతీయువకులు విభిన్నంగా ఆలోచించటం మంచి విషయమంటున్నారు తిరుపతి ఐఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆచార్యులు. ఆ ఆసక్తిని సరికొత్త స్వదేశీ యాప్‌ల రూపొందించే విధంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

టిక్‌ టాక్‌ లాంటి యాప్‌లు వస్తుంటాయి... పోతుంటాయి.. ప్రతిభ మాత్రం లోకల్‌ అంటున్నారు ...తిరుపతి టిక్‌ టాకర్లు. యాప్‌ల మీద నమ్మకంతో కాదు... తమ ప్రతిభ మీద విశ్వాసంతో ముందుకు సాగుతున్నామంటున్నారు. స్వదేశీ యాప్‌లను వినియోగించుకుంటూ.. భవిష్యత్తులోనూ అదే స్థాయిలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆ ఆడియో టేపుల వల్ల కేంద్ర మంత్రికి చిక్కు!

ABOUT THE AUTHOR

...view details