చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి - చిత్తూరు జిల్లా వార్తలు
06:12 September 21
పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో చెలరేగిన మంటలు
చిత్తూరు రంగాచారి వీధిలోvి పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు, బాలాజీ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మూడంతస్తుల భవనంలోని కింది అంతస్తులో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. కింది అంతస్తు నుంచి భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. పరిశ్రమ యజమాని భాస్కర్ కుమారుడు దిల్లీ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. జన్మదినం రోజే అతను మృతి చెందడంతో బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు.
ఇవీ చదవండి: