తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు ఉత్సవమూర్తుల కిరీటాలు మాయమయ్యాయి.ఈ ఘటనపై తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి విచారణ చేపడుతున్నారు. ఆలయ అధికారులను, సిబ్బందిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలికి చేరుకున్నారు.
గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం - tirupathi
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు ఉత్సవ మూర్తుల కిరీటాలు మాయమయ్యాయి
three crowns missing in govinda raja temple
గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు
కిరీటాల మాయంపై విచారణ ప్రారంభించామని తిరుపతి నగర ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు తితిదే విజిలెన్స్ బృందం నుంచి సమాచారం అందిందన్నారు. 1300 గ్రాముల శ్రీదేవి భూదేవి సమేత వేంకటాచల పతి బంగారు కిరీటాలు మాయం అయ్యాయని స్పష్టం చేశారు.
కిరీటాల మాయంపై తిరుపతి ఎస్పీ
"ఆలయ అర్చకులు, సిబ్బందిని విచారిస్తున్నాం. సీసీ టీవీ ఫుటేజ్పరిశీలించాం. కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 6 బృందాలు నియమించి దర్యాప్తు ప్రారంభించాం."- తిరుపతి నగర ఎస్పీ అన్బురాజన్
Last Updated : Feb 3, 2019, 1:30 AM IST