ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబుకు ఏమైనా జరిగితే.. జగన్​దే బాధ్యత'

ప్రజావేదిక కూల్చివేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తగ్గిన భద్రతపై.. తెదేపా నేతల నుంచి అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును ప్రజలకు దూరం పెట్టేందుకే వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

mlc babu rajendraprasad

By

Published : Jun 27, 2019, 4:01 PM IST

'చంద్రబాబుకు ఏమైనా జరిగితే.. జగన్​దే బాధ్యత'

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజల నుంచి దూరం చేసేందుకే ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించిందని తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. కడప జిల్లాలోని ఓ వాగులో ముఖ్యమంత్రి జగన్‌ మేనమామకు సంబంధించిన సినిమా థియేటర్లు ఉన్నాయని.. చెప్పారు. ప్రతిచోటా.. ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప.. ఇలా కూలగొట్టడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుకు భద్రత తగ్గించడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్​దే బాధ్యత అని తిరుమలలో వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం ఆయన దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details