Annamayya memories: తిరుమలలో అన్నమయ్య నివాసమున్న ఇంటిని, అన్నమయ్య మండపాలను కూల్చివేసి తితిదే యాజమాన్యం మోసపూరితంగా వ్యవహరిస్తోందని సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకుడు విజయశంకరస్వామి అన్నారు. అన్నమయ్య పట్ల తితిదే పక్షపాత, మోసపూరిత ధోరణిని అవలంబిస్తోందని స్వాములు ఆరోపించారు. తొలుత అన్నమయ్య ఇంటిని, ఆపై ఆయన మండపాన్ని, ఇప్పుడు అన్నమయ్య, ఆంజనేయస్వామి విగ్రహాల్ని కూడా తొలగించడం దారుణమన్నారు. మాడ వీధుల్లోని మఠాలను, అన్నమయ్య ఇంటినీ ఒకేరకంగా చూడడం తితిదే అధికారులకు తగదన్నారు.
Annamayya Memories: "అన్నమయ్య జ్ఞాపకాలను...తితిదే చెరిపేస్తోంది" - తిరుమల తాజా వార్తలు
Annamayya memories: అన్నమయ్య జ్ఞాపకాలను తితిదే చెరిపి వేస్తుందని స్వామీజీలు ఆరోపించారు. అన్నమయ్య ఇంటిని, మండపాన్ని పునర్నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణం ఈ సమస్యపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే శ్రీవారి భక్తులతో కలిసి మౌనదీక్షలు చేపడతామని హెచ్చరించారు.
Annamayya memories: కొన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న విగ్రహాలను తొలగించే అధికారం తితిదే అధికారులకు లేదన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య ప్రాజెక్టును సైతం కళావిహీనం చేశారని దుయ్యబట్టారు. తక్షణం తితిదే అధికారులు తప్పులను సరిదిద్దుకుని, అన్నమయ్య ఇంటిని, మండపాన్ని తిరిగి నిర్మించడంతోపాటు, ఆయన విగ్రహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాల్ని ప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈనెల 25న తెలుగు రాష్ట్రాలలోని భక్తులతో కలిసి మౌనదీక్ష చేపడతామని హెచ్చరించారు.
Annamayya memories: తిరుపతి నగరంలో మంగళవారం ఈ పరిషత్ ఆధ్వర్యంలో స్వాముల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఈ కార్యక్రమంలో శివదీక్ష పీఠం కర్నూలు ప్రతినిధి ఈశ్వరస్వామి, బంగారుపాళ్యం గంగమ్మ దేవస్థానం ప్రతినిధి శ్రీనివాసులు స్వామి, కేరళ అయ్యప్పస్వామి పాలకమండలి సభ్యుడు రామచంద్రస్వామి, తిరుపతి నుంచి నాగేశ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Tirumala: ఏడుకొండలవాడా.. ఎన్నెన్ని అవస్థలో