ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ వదంతులు నమ్మొద్దు.. నిర్భయంగా జూపార్క్​ను సందర్శించండి'

By

Published : Jul 5, 2022, 6:55 PM IST

sv zoo park curator clarity on tigers wandering: తిరుపతి ఎస్వీ జూ పార్కులో చిరుతల దాడి అని వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని జూ పార్కు అసిస్టెంట్ క్యూరేటర్ మాధవరావు తేల్చి చెప్పారు. పార్కులో చిరుతలు సంచారం వాస్తవమేనని.. అయితే అవి ఇప్పటివరకు ఎవరికీ హాని తలపెట్టలేదన్నారు. వదంతులను నమ్మొద్దని.. ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా పార్కును సందర్శించవచ్చని మరోసారి స్పష్టం చేశారు.

sv zoo park curator madhavarao
sv zoo park curator madhavarao

SV zoological park curator: తిరుపతి జిల్లాలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో చిరుతల సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా వస్తున్న వదంతులను ఎస్వీ జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ మాధవరావు కొట్టి పారేశారు. జూ పార్కు సిబ్బంది, జంతువులను చిరుత గాయపరిచిందని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రదర్శనశాల మొత్తం శేషాచల అడవులల్లో ఉండటంతో చిరుత పులులు పార్కు సమీపంలో సంచరిస్తూ ఉంటాయన్నారు. అయితే ఇప్పటివరకు సిబ్బంది, సందర్శకులకుగానీ ఎలాంటి హాని తలపెట్టలేదని స్పష్టం చేశారు.

మరోవైపు.. ఈ వదంతులు వచ్చినప్పటి నుంచి జూ పార్కులో రాత్రిపూట పెట్రోలింగ్ మరింత పెంచామన్నారు. సందర్శకులకు అన్ని రకాల జాగ్రత్తలు తెలియజేస్తూ.. నిఘా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సందర్శకులు, సిబ్బంది ఈ అవాస్తవాలని నమ్మొద్దని.. ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా పార్కును సందర్శించవచ్చని మరోసారి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details