రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. తిరుపతి స్మార్ట్ రైల్వే ప్రాజెక్టు గురించి అధికారులతో చర్చించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్లాట్‌ఫాంలను.. వాటి నిర్మాణ తీరును పరిశీలించారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుపతి రైల్వేస్టేషన్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టులపై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రాల మధ్య అనుసంధానత పెంచుతామన్నారు.
'రానున్న పదేళ్లలో.. రైల్వే ప్రాజెక్టులపై 50లక్షల కోట్ల పెట్టుబడి' - తిరుపతి
'రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం' -- సురేష్ అంగడి, రైల్వే సహాయమంత్రి.
'రానున్న పదేళ్లలో రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల పెట్టుబడి'